యంగ్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ, అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతోంది. ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ “మనసుని హత్తుకునే సినిమా ఇది. కార్తిక్ ఇందులో గొప్ప విషయం చెప్పాడు. నిన్నటి బాధ, రేపటి ఆశతో బ్రతుకుతుంటాం. కానీ ఈ క్షణాన్ని గుర్తించం. అది గుర్తించినపుడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ . ఇందులో మదర్ ఎమోషన్ తో పాటు మంచి వినోదం వుంది” అని తెలిపారు. అమల అక్కినేని మాట్లాడుతూ “పదేళ్ళ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నా. ఇందులో శర్వానంద్‌కి తల్లిగా చేశాను. అయితే ఈ సినిమా అంతా తల్లిప్రేమ గురించి కాదు. అమ్మ ఎల్లప్పుడూ ఉండలేదు కదా”అని తెలిపారు. శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. “అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. అమ్మ గురించిన సినిమా ఇది.. కాలంతో ప్రయాణం వుంటుంది. శర్వానంద్ తన నటనతో మీ అందరికీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇస్తాడు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభు, రీతూ వర్మ పాల్గొన్నారు.
Sharwanand Speech at ‘Oke Oka Jeevitham’ press meet