Friday, November 22, 2024

చైనా లోన్ యాప్స్.. పేటిఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీలపై ఈడీ దాడి

- Advertisement -
- Advertisement -

Chinese Loan Apps Case

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలు రేజర్‌పే, పేటిఎం, క్యాష్‌ఫ్రీ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించింది. చైనీస్ లోన్ యాప్‌లకు చెందిన కార్యాలయాలపై దా డులు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. బెంగళూరులో ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ అధికారులు వెల్లడించారు. చైనీస్ ఆధ్వర్యంలోని ఈ యాప్ నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తులో భాగంగా శుక్రవారం మొదలైన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంకు ఖాతా ల్లో ఉన్న రూ.17కోట్ల నిధులను సీజ్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ సోదాలపై రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ ప్రతనిధులు మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరిస్తామని తెలిపారు. అయితే పేటిఎం దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. చైనాకు చెందిన పలు లోన్లయాప్‌లు పేమెంట్ చేసేందుకు పేటిఎం, రేజర్‌పే తదితర పేమెంట్ గేట్‌వే కంపెనీలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ సందర్భంగా రోజర్‌పే అధికార ప్రతినిధి మాట్లాడుతూ కొంతమంది తమ ఖాతాదారులుపై ఏడాదిన్నర నుంచి దర్యా ప్తు జరుగుందన్నారు. దరాప్తులో భాగంగా అధికారులు అదనపు సమాచారం కావాలని కోరారన్నారు. ఈడికి సహకరించి కేవైసి, ఇతర వివరాలను అందజేశామన్నారు. పిఎంఎల్‌ఎ, కేవైసి మార్గదర్శకాల ప్రకారమే తాము కార్యకలాపాలు ని ర్వహించామని ఇకముందుకూడా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News