న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. “ఆయన అహ్మదాబాద్ నుంచి ముంబైకు మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నేడు మధ్యాహ్నం 3.15కు జరిగింది. సూర్యా నది మీదున్న వంతెనపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది” అని పోలీసులు తెలిపారు. ఆ కారులో ఆయనతోపాటు ప్రయాణించిన ఇద్దరు, కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని కూడా పోలీసులు తెలిపారు. గాయపడినవారిని గుజరాత్ ఆసుపత్రికి తరలించారు.
సైరస్ మిస్త్రీకి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. 2012లో రతన్ టాటా దిగిపోయాక సైరస్ మిస్త్రీయే టాటాసన్స్ కాంగ్లోమెరేట్స్‌ను ముందుకు నడిపించారు. టాటా సన్స్‌లో ఎక్కువ వాటాను కలిగి ఉన్న కారణంగా షాపూర్‌జీ పలోన్జీ గ్రూప్‌కు చెందిన సైరస్ పల్లోన్జీ మిస్త్రీని చైర్మన్‌గా చేశారు. ఆయన టాటా సన్స్ బోర్డులో 2006లో చేరారు. 2016 అక్టోబర్ 24న అతడిని చైర్మన్ పదవి నుంచి దించేసేలా ఓటింగ్ జరిగింది.
https://youtu.be/_86evCvHhu8