ఢాకా: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీమ్ టీ20లకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. టెస్టులతోపాటు వన్డేలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అని ముష్ఫికర్ తెలిపాడు. అయితే వికెట్‌కీపర్, బ్యాటర్ అయిన వెటరన్ క్రికెటర్ ముష్ఫికర్ టీ20 ఫ్రాంచైజీ ఆడనున్నాడు. టెస్టులతోపాటు వన్డే ఫార్మాట్‌లోనూ బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ రెండు బంగ్లా జట్టును విజేతగా నిలిపేందుకు కృషి చేస్తానని ముష్ఫికర్ వెల్లడించాడు. బంగ్లాదేశ్ ప్రిమియర్ ఇతర ఫ్రాంచైజీల టీ20 టోర్నీల్లో కొనసాగుతానని ముఫ్ఫికర్ తన పేజీలో పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్ ఆసియాకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. శ్రీలంక, అఫ్గాన్ జట్లపై ఓడిన బంగ్లాజట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసియాకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముష్ఫికర్ 4, 1పరుగుల ప్రదర్శనతో విఫలమయ్యాడు. కాగా 2006లో జింబాబ్వేపై టీ20ల్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ మొత్తం 102మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించి 1500పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో ఆరు హాఫ్‌సెంచరీలు నమోదు చేశాడు. వికెట్ కీపర్‌గా 42క్యాచ్‌లు, 30స్టంపింగ్స్ చేశాడు.
Mushfiqur Rahim Announces Retire from T20I