Monday, December 23, 2024

మిస్త్రీ మృతి పట్ల మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

KTR Condolences to demise of Cyrus Mistry

మన తెలంగాణ/హైదరాబాద్: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పట్ల రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వినయం, హుందాతనం, మానవత్వం కలబోసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. గత ఎనిమిదేండ్లుగా ఒక స్నేహితుడిగా సైరస్ మిస్త్రీని కలుసుకున్నప్పుడు సంతోషంగా ఉండేవాడిని. సైరస్ మిస్త్రీ ఆత్మకు శాంతి కలుగాలి’ అని ట్వీట్ చేశారు. సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు సూర్య నది బ్రిడ్జి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరొకరు దుర్మరణం పాలవ్వగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మిస్త్రీ మృతి పట్ల రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

KTR Condolences to demise of Cyrus Mistry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News