Monday, December 23, 2024

నేడు నిజామాబాద్‌కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం,
భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనా న్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా కేం ద్రంలో నిర్మించిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం ప్రారంభిస్తారు. తదనంతరం గిరిరాజు కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిరోజులుగా సిఎం కెసిఆర్ జిల్లా పర్యటలు చేస్తూ, ్పుక్టరేట్ కార్యాలయాలను ప్రా రంభిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే ఆయన నిజామాబాద్ జిల్లా పర్యటనకు నేడు వెళ్లనున్నారు. కాగా సిఎం పాల్గొనే బహిరంగ సభ కోసం జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు భారీ జనసమీకరణలో ని మగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నీ తానై సిఎం కెసిఆర్ పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సభలకు దీటుగా నేటి సభకు రెట్టిం పు జన సమీకరణ చేయాలన్న పట్టుదలతో మంత్రి వేముల, జిల్లా నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీగా జనసమీకరణ చేసి సిఎం కెసిఆర్ మన్ననలు పొందాలని ఊవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేసే బాధ్యతలను కూడా మంత్రి వేముల పార్టీ నేతలకు అప్పగించారు.

కాగా సిఎం రాక ఏర్పాట్లను మంత్రి వేముల క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ముందుగా జిల్లా కేంద్రంలో నిర్మించిన పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారన్నారు.అనంతరం నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభిస్తారని వెల్లడించారు. తదనంతరం బహిరంగ సభలో పాల్గొని, జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. కాగా ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. సిఎం సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరిలి వచ్చేందుకు ఆసక్తితో ఉన్నారన్నారు.

వాహనాలను సమకూర్చితే చాలు….సభకు వస్తామని జిల్లా ప్రజలు తనకు నేరుగా ఫోన్లు చేస్తున్నారన్నారు. దీంతో సభకు తన అంచనాలకు మించి జనాలు తరలివచ్చే అవకాశముందని మంత్రి వేముల పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, నిజామాబాగ్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎంఎల్‌సి విజి గౌడ్, టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జెడ్‌పి చైర్మన్ విఠల్ రావు, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ నాగరాజు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News