Monday, December 23, 2024

ఇండియాపై పాక్ ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

Asia Cup Super 4: PAK Win by 5 wickets against IND

దుబాయ్: ఆసియాకప్ 2022 సూపర్ 4లో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాదులు భారత్‌పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ 5వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచిన గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 7వికెట్లకు 181పరుగులు చేసింది. కోహ్లీ(60)హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ విఫలమైనా కీపర్ రిజ్వాన్ విజృంభించి 51బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్‌లతో 71పరుగులు చేసి మ్యాచ్‌ను పాక్ వైపు తిప్పాడు. చివర్లో పాక్ టెయిలెండర్లు రెచిపోవడంతో పాకిస్థాన్ మరో బంతి మిగిలి ఉండగానే 182పరుగులు చేసి విజయం సాధించింది.
రాహుల్‌-రోహిత్ శుభారంభం
ఈ టాస్ పాక్ బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. హిట్‌మ్యాన్ రోహిత్ రాహుల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. నసీంషా పాక్ బౌలింగ్ ఎటాక్‌ను ఆరంభించగా నాలుగోబంతిని బౌండరీకి తరలించిన రోహిత చివరిబంతిని మీదుగా సిక్సర్‌గా మలిచాడు. తొలి ఓవర్లో భారత్ 11పరుగులు చేసింది. ఈక్రమంలో మూడో ఓవర్లో తనవంతుగా రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 34పరుగులుకు చేరింది. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లకే స్కోరు హాఫ్‌సెంచరీ దాటి 54పరుగులుకు చేరింది. ఈక్రమంలో బౌలింగ్‌కు దిగిన హరీస్ రవూఫ్ ఆరోఓవర్ తొలి బంతికే రోహిత్‌కు షాక్ ఇచ్చాడు. 16బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స్‌లతో 28పరుగులు చేసిన రోహిత్..ఖుష్‌దిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 62పరుగులు చేసింది. మరుసటి ఓవర్లోనే రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 20బంతుల్లో ఓ రెండు సిక్స్‌లతో 28పరుగులు చేసిన రాహుల్ బౌలింగ్‌లో భారీ యత్నించి నవాజ్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్లిద్దరూ ఔటవడంతో కోహ్లీ, సూర్య భారత ఇన్నింగ్స్‌ను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.
హార్దిక్ డకౌట్.. కోహ్లీ ఒంటరిపోరు
వికెట్‌ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడుతున్న కోహ్లీసూర్య జోడీకి మొహమ్మద్ నవాజ్ షాక్ ఈ జోడీని విడదీసి సూర్యను పెవిలియన్‌కు పంపాడు. 10బంతుల్లో 2ఫోర్లుతో 13పరుగులు చేసిన సూర్య..నవాజ్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్ ఆడబోయి అసిఫ్ అలీ చేతికి చిక్కాడు. 10ఓవర్లు ముగిసేసరికి భారత్ 93/3 స్కోరు నమోదు చేసింది. లెఫ్ట్ బ్యాటర్ పంత్ క్రీజులోకి వచ్చాడు. 11ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు సెంచరీ మార్కుదాటి 101పరుగులుకు చేరింది. కోహ్లీ ఒంటరిపోరాటం చేస్తూ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. దీపక్‌హుడాతో జతకట్టిన కోహ్లీ 18వ ఓవర్లో చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీసిక్సర్ బాది హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
బాబర్‌కు రవి బిష్ణోయ్ షాక్
భారత్ నిర్దేశించిన 182పరుగుల లక్ష్యాన్నిఛేదించేందుకు బాబర్, రిజ్వాన్ బరిలోకి దిగారు. భువి బౌలింగ్‌లో తొలిబంతిని రిజ్వాన్, ఐదోబంతిని బాబర్ బౌండరికి తరలించారు. ఈక్రమంలో నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన కుడిచేతివాటం లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ పాక్ కెప్టెన్‌కు షాక్ ఇచ్చాడు. రవి వేసిన ఫ్లాట్‌బాల్‌ను భారీషాట్ కొట్టేయత్నంలో మిడ్‌వికెట్ దగ్గరున్న దొరికిపోయాడు. 22పరుగులు వద్ద పాక్ తొలి వికెట్ పడింది. పవర్‌ప్లే ముగిసేసరికి పాక్ వికెట్ నష్టానికి చేసింది. ఏడో ఓవర్లో పాక్ స్కోరు హాఫ్‌సెంచరీ మార్కుదాటి 51/1కు చేరింది. 9వ ఓవర్లో చాహల్ బౌలింగ్‌లో ఫఖార్ జమాన్ కోహ్లీకి ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ నష్టానికి 76 పరుగులు చేసింది. దీంతో పాక్ విజయలక్షం 60బంతుల్లో 106 పరుగులుకు చేరింది. ఈ దశలో రిజ్వాన్‌నవాజ్ జోడీ పాక్‌ను ఆదుకుంది. రిజ్వాన్ హాఫ్‌సెంచరీ చేయడంతో 15 ఓవర్లుకు పాక్ 135/2 స్కొరు చేసింది. ఈ దశలో లక్షం 30బంతుల్లో 47పరుగులుకు చేరింది. 16వ ఓవర్లో భువనేశ్వర్ ఈ జోడిని విడదీసి నవాజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 20బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్‌లతో 42పరుగులు చేసిన నవాజ్..భువీబౌలింగ్‌లో హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత ఓవర్లో బౌలింగ్‌కు దిగిన హార్దిక్ జోరుమీదున్న రిజ్వాన్‌కు చెక్ చెప్పాడు. 51బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్‌లతో 71పరుగులు చేసి రిజ్వాన్..సూర్యకు క్యాచ్‌ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. 18వ ఓవర్లో భువీ బౌలింగ్‌లో ఆసిఫ్ అలీ సిక్స్, ఖుష్‌దిల్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ పాక్‌వైపు మొగ్గుచూపింది. హూళెకమంలో పాక్ 19ఓవర్లయ్యేసరికి 175పరుగులు చేసింది. దీంతో పాక్ లక్షం 6బంతుల్లో 7పరుగులు అవసరమవగా..చివరిఓవర్లో బౌలింగ్‌కు దిగిన అర్షదీప్ తొలిబంతికి సింగిల్ ఇచ్చాడు. రెండో బంతిని ఆసిఫ్ అలీ బౌండరీకి తరలించడంతో పాక్ విజయతీరాలకు చేరింది. అయితే నాలుగో బంతికి అలీ అర్షదీప్ వికెట్ల ముందో బోల్తా కొట్టించడంతో ఎల్బీరూపంలో ఔటయ్యాడు. రెండు బంతులకు రెండు పరుగుల అవసరమవగా ఇఫ్తికర్ క్విక్ డబుల్ తీయడంతో పాక్ మరో బంతి మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. పాక్ 19.5 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 182పరుగులు సాధించి విజయ లక్ష్యాన్ని ఛేదించింది.

Asia Cup Super 4: PAK Win by 5 wickets against IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News