Monday, December 23, 2024

గంగానదిలో మునిగిన పడవ: పది మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

 A boat carrying 55 people sank in the Ganga river

 

పాట్నా: గంగానదిలో పడవ మునిగి పది మంది గల్లంతైన సంఘటన బీహార్ రాష్ట్రం దనపూర్ ప్రాంతం షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గంగా నదిలో ఓ పడవ 55 మందితో ప్రయాణిస్తుండగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది గల్లంతయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని దనపూర్ ఎస్‌డిఎం తెలిపారు. పడవలో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News