Saturday, April 19, 2025

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడని… స్నేహితుడిని చంపి

- Advertisement -
- Advertisement -

Man Murdered in Anantapur

బెంగళూరు: ప్రేమించిన యువతిని స్నేహితుడు పెళ్లి చేసుకోవడంతో అతడిని హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం కృష్ణరాజపురం ప్రాంతం బయప్పనహళి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సతీష్, రాకేశ్ అనే వ్యక్త ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. ఒకే దగ్గర ఇద్దరు ప్లవర్ డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబ సభ్యులు వాదోడుచేదోడుగా ఉంటారు. రాకేశ్ అనే యువకుడి ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. రాకేశ్‌కు తెలియకుండా సతీశ్ ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అని ఆగ్రహంతో రాకేశ్ రగిలిపోతున్నాడు. సతీశ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుగా చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News