- Advertisement -
కాబూల్: అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోన రష్యా దౌత్యకార్యాలయం వెలుపల సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు రష్యన్ దౌత్య సిబ్బందితోపాటు మరో అఫ్ఘాన్ పౌరుడు మరణించాడు. ఈ దాడిని రష్యా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదయోగ్యం కాని ఉగ్రవాద చర్యగా రష్యా అభివర్ణించింది. రష్యా దౌత్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద తమ వీసాల పరిస్థితి తెలుసుకోవడానికి కొందరు అఫ్ఘాన్ పౌరులు వేచి ఉన్న సమయంలో ఆ ప్రదేశం వద్దనే ఆత్మాహుతి దాడి జరిగింది. వీసాలు పొందిన అభ్యర్థుల పేర్లను చదవడానికి ఒక రష్యన్ దౌత్యా ధికారి వెలుపలకు వచ్చిన సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు రష్యా విదేశాంగ కార్యాలయం, రష్యా అధికారిక వార్తాసంస్థ రియా నోవోస్తి తెలియచేశాయి. ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
Suicide Attack at Russian Embassy in Afghanistan
- Advertisement -