Friday, November 15, 2024

రైతులకు రూ.3 లక్షలు రుణమాఫీ.. ఉచిత విద్యుత్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi Promises Farm loan waiver in Gujarat

రైతులకు రుణమాఫీ..ఉచిత విద్యుత్
రూ.500కే ఎల్‌పిజి సిలిండర్
గుజరాత్ ఓటర్లపై రాహుల్ హామీల వర్షం

అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ గెలుపొంది అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ప్రస్తుతం రూ.1000 దాటిన ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామని, రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్ అందచేస్తామని, అదేవిధంగా సామాన్య వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందచేస్తామని రాహుల్ ప్రకటించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిఒడ్డున నిర్వహించిన పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గుజరాత్ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 3,000 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు నిర్మిస్తామని, బాలికలకు ఉచిత విద్యను అందచేస్తామని, పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ. 5 సబ్సిడీ అందచేస్తామని రాహుల్ ప్రకటించారు. గుజరాత్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించిన బిజెపి ప్రభుత్వం పటేల్ ఆశయాలను విస్మరించిందని రాహుల్ ఆరోపించారు.

Rahul Gandhi Promises Farm loan waiver in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News