Monday, December 23, 2024

బుద్ధ వనంలో అంతర్జాతీయ బౌద్ధరామాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తైవాన్ దేశ ప్రతిష్టాత్మక మహాబోధి సొసైటీ ప్రతినిధులు శ్రమనెర, బిక్షు బుద్ధ దత్త, సాగటనందాలు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యతో కలసి సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బుద్ధుడి తర్వాత మరో బుద్ధుడిగా పేరుగాంచిన ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశం తెలంగాణ అని తెలిపారు. తొలి బౌద్ధ విశ్వవిద్యాలయం కేంద్రం కృష్ణా నది ఒడ్డున ఉన్న నాగార్జున సాగర్ లో 274 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి లో బౌద్ధ వారసత్వ కేంద్రం ను అభివృద్ధి చేశామన్నారు. ఈ సందర్భంగా బుద్ధవనం అభివృద్ధి లో భాగంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించి దశల వారిగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధి, అంతర్జాతీయంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ సమావేశంలో తైవాన్ నుండి వచ్చిన బౌద్ధ బిక్షువులు నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టు లో ప్రసిద్ధ మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో బౌద్ధ ఆరామాలు, ధ్యాన మందిరాలు నిర్మాణం, ఆధ్యాత్మిక విద్యా కేంద్రాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని బౌద్ధ బిక్షువులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ప్రతిపాదనలు సమర్పించారు. తైవాన్ కు చెందిన మహాబోధి సొసైటీ కి చెందిన బిక్షువులు సమర్పించిన ప్రతిపాదనలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే ప్రతిపాదనలు పరిశీలించాలని బుద్ధవనం ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, తైవాన్ బిక్షువులు హుయ్ జియన్ స్రామనేరా పో గుంగ్ షాన్ మాయిక్ ఢిల్లీ, బిక్క్హు బుద్ధ దత్తా మహాబోధి సోసైటి బెంగళూరు, సాగాతానందా మహాబోధి విహారా హైదరాబాద్, సంఘాపాల మహాబోధి విహారా హైదరాబాద్, డాక్లర్ బాలు సల్వా బ్లియా హైదరాబాద్, పో గుంగ్ షాన్ రెప్ హైదరాబాద్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News