- Advertisement -
న్యూఢిల్లీ : 1971 నాటి బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన భారతీయ సైనికుల వారసులకు ముజిబ్ స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్టు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మంగళవారం ప్రకటించారు. హసీనా తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరున బుధవారం ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఈమేరకు భారత ఆర్మీకి చెందిన కుటుంబ సభ్యులు 200 మందికి ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి అమూల్యమైన మద్దతు లభించినందుకు తాము సర్వదా కృతజ్ఞులమని, తమ ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఆవిర్భావ సమయమని హసీనా అభివర్ణించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ యుద్ధంలో భారత ఆర్మీ సిబ్బంది 1984 మంది అమరులైనట్టు తెలుస్తోంది.
- Advertisement -