Saturday, December 21, 2024

‘రిసెర్చ్ 360’ని ప్రారంభించిన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్

- Advertisement -
- Advertisement -

Motilal Oswal Financial Services Launches Research 360

హైదరాబాద్: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) మొట్టమొదటిసారిగా ఆర్థిక మార్కెట్ పరిశోధన &విశ్లేషణ ప్లాట్‌ఫారమ్ అయిన ‘రీసెర్చ్ 360’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ మదుపరులు &వ్యాపారులు వివరణాత్మక ప్రాథమిక, సాంకేతిక పరిశోధనలను నిర్వహించడానికివన్ స్టాప్ గమ్యస్థానంగా పని చేస్తుంది, ఇది ఈక్విటీ, డెరివేటివ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, థీమ్ &మోడల్ పోర్ట్‌ ఫోలియోలు మొదలైన వివిధ విభాగాలలో వివేకవంతమైన పెట్టుబడి లేదా ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. రీసెర్చ్ 360 యాప్ అనేది DIY కేటగిరీ మదుపరులకు, అలాగే రెడీమేడ్ రీసెర్చ్ సొల్యూషన్‌ల కోసం వెతుకుతున్న వారికి ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన. ‘RSEARCH 360’ ప్రారంభం FY23లో డిజిటల్ ఉత్పత్తుల పోర్ట్‌ ఫోలియో విస్తరణలో ఒక భాగం.

రీసెర్చ్ 360 ప్లాట్‌ఫారమ్ అనేది ఏస్ ఇన్వెస్టర్ పోర్ట్ ఫోలియో వంటి పటిష్ఠ ఉత్తేజకరమైన ఫీచర్‌లను కలిగి ఉంది.అనుభవం లేని మదుపరులుదీని నుండి ప్రయోజనం పొందవచ్చు. స్టాక్ పోర్ట్‌ ఫోలియో నిర్మాణం తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. టెక్నో-ఫండా స్కానర్‌లు మెచ్యూర్ ఇన్వెస్టర్‌లకు ఒక మెనూలో ధర, వాల్యూమ్, ఫండమెంటల్, టెక్నికల్ ఇండికేటర్‌లు మొదలైన వాటికి సంబంధించిన 200 ప్లస్ స్కాన్‌ల నుండి ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ యాప్ SWOT విశ్లేషణ, స్టాక్‌లను పోల్చడం, FnO అనలిటిక్స్, MO ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ రిపోర్ట్‌లు, ఏస్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ ఫోలియో వంటి ఇతర కీలక ఫీచర్లను కూడా అందిస్తుంది.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బ్రోకింగ్ &డిస్ట్రిబ్యూషన్ సీఈఓ అజయ్ మీనన్ ఈ ఉత్పాదనని ప్రారంభించడంపై వ్యాఖ్యానిస్తూ, “రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్చి 31, 2022 నాటికి భారతదేశంలో క్రియాశీల డీమ్యాట్ ఖాతాల సంఖ్య 89.7 మిలియన్లు. FY22లో 63% వృద్ధిని చూపుతోంది. ఎంచుకునే పెట్టుబడి గురించి సవివరమైన పరిశోధన తర్వాతే క్యాపిటల్ మార్కెట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలని మేం భావిస్తున్నాం. మోతీలాల్ ఓస్వాల్ 35 సంవత్సరాలకు పైగా ఈక్విటీ మార్కెట్‌లో ఉన్నందున, మా క్లయింట్లుగా ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా మదుపరులందరికీ మా రీసెర్చ్ ప్రపంచానికి స్వాగతం పలకాలని ఆలోచించాం. మా తాజా ఆఫర్, రీసెర్చ్ 360అనేది మదుపరులందరికీ మోతీలాల్ ఓస్వాల్ అవార్డ్ విన్నింగ్ రీసెర్చ్‌ కి యాక్సెస్‌ను అందిస్తుంది. తగిన సమాచారంతో కూడిన పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడంలోవారికి సహాయపడుతుంది’’ అని అన్నారు.

శ్రీ మీనన్ ఇంకా ఇలా అన్నారు, “మొత్తం రిటైల్ క్లయింట్ 44% YY వృద్ధితో, B&D వ్యాపారం తన రిటైల్ క్లయింట్ బేస్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. కస్టమర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్‌గా, మా PHYGITAL వాగ్దానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము మా సాంకేతికతను నిరంతరం పెంచుతున్నాం. ఉద్యోగుల సంఖ్యను పెంచాలనే మా లక్ష్యంతో పాటు, MOFSLతో చేతులు కలపడానికి పలువురు వ్యక్తిగత బ్రోకర్ల నుండి కూడా మేము భారీ ఆసక్తిని చూస్తున్నాం’’ అని అన్నారు.

రీసెర్చ్360అనేది మదుపరులకు, ట్రేడర్లకు పరిశోధన గమ్యస్థానానికి వేదికగా పనిచేస్తుంది. ప్లాట్‌ఫారమ్ బహుళ మూలాల నుండి డేటా సోర్సింగ్ కు సంబంధించి కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ధరను తగ్గించే విధంగా అభివృద్ధి చేయబడింది.రీసెర్చ్ 360 అప్లికేషన్ అనేది ఆండ్రాయిడ్పరికరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో, యాపిల్ పరికరాల కోసం యాప్ స్టోర్‌లో సులభంగా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం వివరణాత్మక పరిశోధన నివేదిక సేవలు ఉచితం, అయితే రాబోయే నెలల్లో మేం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడల్‌కి మారాలని యోచిస్తున్నాం.

మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ బ్రోకింగ్ &డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం ఆర్థిక ఉత్పత్తి పంపిణీ AUM ఏటేటా ప్రాతిపదికన 31%వృద్ధితో ₹16,764 కోట్లకు చేరుకుంది. DP AUM FY22 ఏటేటా ప్రాతిపదికన 34% వృద్ధిని సాధించింది. పరిశ్రమలో అత్యధిక ARPUలలో (యూనిట్‌కు సగటు ఆదాయం) ఒకదానిగా FY22లో B&D వ్యాపారం అత్యధిక వార్షిక డైలీ టర్న్ ఓవర్, వార్షిక రాబడి, లాభాలను నమోదు చేసింది.

క్లయింట్‌లకు రీసెర్చ్ 360 ప్రయోజనాలు:
• కంపెనీలు & వాటి స్టాక్ పనితీరు గురించి మొత్తం ప్రాథమిక &సాంకేతిక సమాచారం
• తోటి కంపెనీలతో పోలిస్తే ఆదర్శవంతమైన స్టాక్‌ ఎంచుకోడానికి అడ్వాన్స్ స్క్రీనింగ్ & విశ్లేషణాత్మక సాధనాలు
• సాలిడ్ రీసెర్చ్ – ఆన్‌లైన్ చర్చా వేదికల ద్వారా మార్కెట్ నిపుణులు & విశ్లేషకులతో సలహా & సంప్రదింపులు
• మోతీలాల్ ఓస్వాల్ అవార్డు విన్నింగ్ రీసెర్చ్ & ఆయా రంగాలపై సంస్థ నివేదికలు
• దీర్ఘకాలిక &స్వల్పకాలిక ట్రేడింగ్, పెట్టుబడి ఆలోచనలు
• అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ శిక్షణ కోర్సులు
• సూపర్ స్టార్, FII &సంస్థల పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి

MOFSL ఒక ఆర్థిక సేవల సంస్థ. దీని ఉత్పాదనలలో క్యాపిటల్ మార్కెట్‌ల వ్యాపారాలు (రిటైల్ బ్రోకింగ్, ఇన్‌స్టిట్యూ షనల్ బ్రోకింగ్ &ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్), అసెట్ &వెల్త్ మేనేజ్‌మెంట్ (ఆస్తి నిర్వహణ, ప్రైవేట్ ఈక్విటీ & వెల్త్ మేనేజ్‌మెంట్), హౌసింగ్ ఫైనాన్స్ &ఈక్విటీ ఆధారిత ట్రెజరీ పెట్టుబడులు ఉన్నాయి. MOFSL 10,000+ ఉద్యోగులను కలిగి550+ నగరాల్లో పంపిణీ రీచ్ ద్వారా 50 లక్షల క్లయింట్‌లకు సేవలు అందిస్తుంది. MOFSL రూ.2.9 tn AUA కలిగిఉంది.

Motilal Oswal Financial Services Launches Research 360

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News