Monday, December 23, 2024

ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha who visited Ganesha of Khairatabad

మన తెలంగాణ / హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడిని ప్రజలంతా కొంగు బంగారంలా కొలుస్తారని శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఖైరతాబాద్‌లో గల భారీ గణనాథుడిని ఆమె మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయకుడి కోసం ప్రజలు ఏడాదంతా ఎదురు చూస్తారన్నారు. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 50 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేయడం ప్రపంచానికే గొప్ప సందేశం అని కవిత అన్నారు. వినాయకుడిని మట్టితో తయారు చేసినందుకు ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవ కమిటి సభ్యులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె ప్రార్థించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News