Monday, December 23, 2024

శ్రీకాకుళంలో లాకప్‌డెత్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ జరిగింది. ఓ కేసు విచారణ కోసం పోలీసుల అదుపులో ఉన్న మహేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.  విచారణ పేరుతో పోలీసులు వేధించడంవల్లే మహేష్ మృతి చెందాడని బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. బూర్జ పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన చేస్తున్నారు. మృతదేహాన్ని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. పోలీసులు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి…  తీవ్రంగా కొట్టడంతోనే అతడు చనిపోయి ఉంటాడని అతడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News