కరీంనగర్: ప్రేమించి పెళ్లి చేసుకుంది… ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో తన తల్లితో కలిసి భర్తను భార్య చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఎన్‌టిపిసి ఆటోనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం శ్రావణి అనే యువతి, అజీంఖాన్(33) ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అజీంఖాన్ తన భార్యతో కలిసి అతగారింట్లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపించి ఆమె ఓ సంస్థలో పని చేస్తోంది. ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అజీంఖాన్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంతో భార్య, అత్త అతడితో గొడవకు దిగారు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్తను ఇంట్లోకి లాక్కెళ్లి గొంతు నులిమారు. అతడు కిందపడిపోవడంతో 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది పరీక్షించిన అనంతరం అతడు మృతి చెందినట్లుగా వెల్లడించారు. అజీంఖాన్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అత్త నర్మద, భార్యను అదుపులోకి తీసుకున్నారు