Saturday, December 21, 2024

అర్హులైన వారందరికి పెన్షన్‌లు మంజూరు: తలసాని

- Advertisement -
- Advertisement -

Grant of pensions to all eligible: Talasani

హైదరాబాద్ : నగరంలో అర్హులైన ప్రతి ఒకరికి ఆసరా పెన్షన్‌లను అందించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్‌ల పంపిణీపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 1.96లక్షల మంది ప్రతినెలా ఆసరా పెన్షన్‌లను పొందుతున్నారని,వీరికి నెలకు 42.22 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నూతనంగా 77,695 మందికి పెన్షన్‌లను మంజూరు చేసిందని వివరించారు. నూతనంగా పెన్షన్‌లు మంజూరైన వారికి నియోజకవర్గాలలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి లబ్దిదారులకు మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు.

ఇందుకు ఎమ్మెల్యేల సహాకారంతో ఏర్పాటు చేయాలని అదికారులను మంత్రి ఆదేశించారు. దరఖాస్తు చేసుకొన్న వారిలో ఇంకా కొంతమందికి పెన్షన్‌లు మంజూరు కాలేదనిపలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో ప్రస్తావించగా,పూర్తి స్దాయి విచారణ జరిపి అర్హులైన వారందరికి పెన్షన్‌లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు సురభివాణిదేవి, ప్రభాకర్‌రావు, స్తీపెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్,మాగంటి గోపినాథ్,కాలేరు వెంకటేష్,ముఠా గోపాల్,సాయన్న, కౌసర్ మొహినోద్దిన్, బలాల,మౌజం హుస్సేన్,కలెక్టర్ అయోయ్‌కుమార్, ఆర్డీఓలు వసంత,వెంకటేశ్వర్లు, పలువురు తహసీల్లార్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News