Friday, January 3, 2025

రాణా కపూర్‌కు సెబీ రూ.2 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

Rana Kapoor fined Rs 2 crore by SEBI

న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్‌కు చెందిన ఎటి1 బాండ్లను తప్పుగా విక్రయించినందుకు గానూ బ్యాంక్ మాజీ ఎండి, సిఇఒ రాణా కపూర్‌పై క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఆయన 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని సెబీ ఆదేశించింది. అధికారుల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాంక్‌కు చెందిన ఎటి1 బాండ్ల తప్పుడు విక్రయానికి సంబంధించిన కేసు ఇది. సెకండరీ మార్కెట్‌లో ఎటి1 (అడిషనల్ టైర్1) బాండ్ల విక్రయానికి సంబంధించిన రిస్క్ గురించి ఇన్వెస్టర్లకు బ్యాంకు గానీ, అధికారులు గానీ తెలియజేయలేదని సెబీ ఆరోపించింది. 2016లో ప్రారంభించిన ఎటి1 బాండ్ల విక్రయం, 2019 సంవత్సరం వరకు కొనసాగించారు. ఈ ఎటి1 బాండ్ల విక్రయానికి సంబంధించి లావాదేవీలు అన్ని కూడా కపూర్ పర్యవేక్షణలో జరిగాయని 87 పేజీల ఆర్డర్‌లో సెబీ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News