Friday, November 22, 2024

భిన్న వైవిధ్యాలతో లిజ్ ట్రస్ కేబినెట్

- Advertisement -
- Advertisement -

Liz Truss held her first cabinet meeting

భారతీయ సంతతి మహిళకు హోం శాఖ
మైనార్టీ వర్గాలకే కీలక పదవులు
తొలి కేబినెట్‌లో ఇంధన సమస్యలపై దృష్టి
సునాక్ మద్దతుదార్లందరికీ షాక్

లండన్ : బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ బుధవారం తమ తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ప్రస్తుత తీవ్ర సమస్య అయిన ఇంధన సంక్షోభ నివారణకు మార్గాలపై తొలి భేటీలో దృష్టి సారించారు. ప్రజలకు తీవ్రస్థాయిలో వచ్చిపడుతున్న విద్యుత్ బిల్లుల సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించడంపై చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇకశ్వ్కేడి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కేబినెట్ భేటీకి ముందు లిజ్ తమ కేబినెట్‌నుంచి కొందరు పాత ప్రముఖులను తీసివేశారు. తమది విభిన్న, వైవిధ్య కేబినెట్ అని తెలిపారు. అయితే కీలక పదవులలో వివిధ జాతులకు చెందిన మైనార్టీలకు స్థానం కల్పించారు. తొలిసారిగా బ్రిటన్ కేబినెట్‌లో శ్వేతజాతీయులకు కీలక పదవులు దక్కలేదు. మంత్రిపదవులు దక్కిన వారిలో భారతీయ సంతతికి చెందిన మహిళ స్యూయెలా బ్రేవరెమెన్ దేశ హోం మంత్రి అయ్యారు. భారత్‌లోని ఆగ్రాలో జన్మించిన అలోక్ వర్మ తమ ఇంతకు ముందటి కాప్ 26 అధ్యక్షులుగా ఉంటారు. అదే విధంగా రక్షణ మంత్రిగా బెన్ వెల్సెస్ కొత్త కేబినెట్‌లోనూ ఉన్నారు. జూనియర్ మంత్రి రణిల్ జయవర్థనే లండన్‌లో జన్మించినా ఆయన శ్రీలంక, వారసత్వ మూలాలున్న వ్యక్తి. ఆయన ఇప్పుడు పర్యావరణ , ఆహార , గ్రామీణ వ్యవహారాల మంత్రిగా నియమితులు అయ్యారు.

ప్రధాని పదవికి పోటీలో రిషి సునాక్‌కు మద్దతు పలికిన పలువురు మంత్రులు ఇప్పుడు పదవీచ్యుతులు అయ్యారు. వీరిలో మాజీ న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్, రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్ , ఆరోగ్య మంత్రి స్టీవీ బార్క్‌లే ఉన్నారు. కేబినెట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా కొలిక్కి రాలేదు. కేబినెట్‌లో ఉప ప్రధానిగా థెరెసె కాఫీయి ఉంటారు. కొత్త కేబినెట్‌లో తాను పదవి తీసుకోనని ముందుగానే సునాక్ ప్రకటించారు. భారతీయ మూలాలున్న సునాక్‌కు కేబినెట్‌లో ట్రస్ స్థానం కల్పించకపోవడమే కాకుండా ఆయన వర్గీయులను పక్కకు పెట్టారు.

పటేల్ స్థానంలో ఇండియా లేడీ

ప్రీతీపటేల్ స్థానంలో బ్రెవెర్‌మెన్ దేశ కీలకమైన హోం మంత్రి బాధ్యతలు చేపడుతారు. ఆమె బారిస్టర్. ఫరేహం స్థానానికి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తు ఆమె ఇంతకు ముందు అటార్నీ జనరల్ బాధ్యతలలో ఉన్నారు. దేశ ప్రధాని పదవికి తొలిదశలో ఆమె కూడా పోటీ పడ్డారు. తరువాత రౌండ్‌లో వైదొలిగారు. 42 సంవత్సరాల బ్రెవెరెమన్ ఇద్దరు పిల్లల తల్లి. హిందూ తమిళ మహిళ ఉమ, గోవాకు చెందిన తండ్రి క్రిస్టి ఫెర్నాండేజ్ కూతురు అయిన ఆమె తల్లి ఆ తరువాత మారిషస్ నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. తండ్రి కెన్యా నుంచి బ్రిటన్‌కు వచ్చారు. 2018లో బ్రెవెర్‌మన్ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో లా చదివిన రాయిల్ బ్రెవర్‌మెన్‌ను పెళ్లాడింది. కాలక్రమంలో ఆమె బౌద్ధ మతం స్వీకరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News