నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఎవరో చెప్పిన మాటలు నమ్మి గందరగోళానికి గురికావొద్దు : మంత్రి
తలసాని. హుస్సేన్ సాగర్ చుట్టూ మేయర్ విజయలక్ష్మితో ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ ఏర్పాట్ల పరిశీలన
మన తెలంగాణ/సిటీ బ్యూరో: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై బిజెపి రాజకీయం చేస్తూ నిర్వాహకులను తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేస్తోందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయ ర్ గద్వాల్ విజయలక్ష్మి ధ్వజమెత్తారు. బి జెపి నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం చివరికి దేవుళ్లను సైతం అడ్డుం పెట్టుకుకోవడం వారి దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అన్నారు. ఈనెల 9న జరగనున్న వినాయక నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్‌తోపాటు గ్రేటర్ వ్యా ప్తంగా భారీ ఏర్పాట్లను చేపట్టామని వారు వెల్లడించారు. హుస్సేన్‌సాగర్ ఎన్‌టిఆర్ మార్గ్‌తో పాటు ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఓపెన్ టాప్ వాహనంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయతో మీడియాతో కలిసి పరిశీలించడంతో పాటు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఒకొక్కటిగా వివరిస్తూ ముందుకు సాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి పండగను ప్రజలు ఆనందోత్సహాల మధ్య జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోందని తలసాని అన్నారు. పండగ ఏర్పాట్లపై ఎవరితో ఏదో చెబితే చేసే ప్రభుత్వం కాదని, ప్రజల సంతోషమే లక్షంగా పని చేస్తున్నమన్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు ఎవరో చెప్పిన మాటలు నమ్మి గందరగోళానికి గురికావద్దని నిమజ్జనానికి అవసరమైన ప్రతిదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. నిర్వాహకులకు వివరించేందుకే మేయర్‌తో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లను పరిశీలించామని వెల్లడించారు. నిమజ్జనం 9వ తేదీ ఉన్నందున ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌తో పాటు పర్యాటకులకు ఇబ్బందులు కలగకూడదనే క్రమక్రమంగా ఏర్పాట్లు చేస్తున్నామని గురువారం రాత్రి వరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయని తెలిపారు. అంతలోనే కొందరూ తమ ఉనికిని చాటుకునేందుకే రా ్యలీలు, దీక్షలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలు బాధాకరమన్నారు. అన్ని పండుగలను గొప్పగా జరపాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ వస్తుందని వివరించారు. నగరంలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నవరాత్రుల సందర్భంగా జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు 38 వేల విగ్రహాలను ప్రతిష్టించారని వీటన్నింటిని ప్రశాంతగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు.
2014 కు ముందు ఇన్ని ఏర్పాట్లు లేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. నిర్వాహకులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జిహెచ్‌ఎంసి, పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్క్, ఎండోమెంట్, ఎలక్ట్రికల్, టూరిజం, హెల్త్, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. 9వ తేదీన నిమజ్జనం సందర్భంగా శోభయాత్రగా తరలి వచ్చే వినాయకలకు దారి పొడవునా ఘనంగా స్వాగతం పలికనున్నామన్నారు. ఇందుకు బాలాపూర్ వినాయకుడి నుంచి లాల్ దర్వాజ, చార్మినార్, అప్జల్ గంజ్, బేగంబజార్, ఎంజె మార్కెట్ తదితర ప్రాంతాలలో స్వాగత వేదికలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కొందరూ హిందువుల పండుగలు అంటూ వేరుచేసి మాట్లాడుతున్నారని, మేము హిందువులము కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, ప్రవర్తనలను మానుకోవాలని మంత్రి హితవు పలికారు.
ఏర్పాట్లపై భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అసంతృప్తి
ఈ నెల 9న జరిగే సామూహిక వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంజె మార్కెట్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిమజ్జన ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మంగళవారం ట్యాంక్‌బండ్ వద్ద భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నాయకులను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బుధవారం మధ్యాహ్నానికి ట్యాంక్‌బండ్ నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభం కావడంతో మంగళవారం చేపట్టిన నిరసన దీక్షను విరమించారు.