ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్‌కు చెందిన భీమా విభాగం లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్‌ను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నుంచి అందుకుంది. తద్వారా భీమా, సాధారణ భీమా ఉత్పత్తులను నేరుగా విక్రయించవచ్చు. ఈ ప్రత్యక్ష బ్రోకరింగ్ లైసెన్స్ ఇప్పుడు లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ భీమా రంగంలో ప్రవేశించడానికి ప్రతీకగా నిలుస్తుంది.
లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకరింగ్ ఇప్పటికే కొన్ని సుప్రసిద్ధ భీమా సంస్ధలతో చర్చలు జరపడంతో పాటుగా వారితో భాగస్వామ్యం చేసుకుని జీవిత మరియు సాధారణ భీమా ఉత్పత్తులను పాలసీ కింగ్‌గా పిలువబడే తమ ప్లాట్‌ఫామ్ పై విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాలసీకింగ్‌ను స్మార్ట్‌ఫోన్లు, ఐ ఫోన్లపై డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు అందుబాటులోని అన్ని భీమా ఉత్పత్తులను సరిపోల్చుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా తగిన సలహాలు, మార్గనిర్దేశనం చేయడం ద్వారా సరైన భీమా ఉత్పత్తులు, టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్యభీమా, మోటార్ భీమా మొదలైనవి ఎంచుకునే అవకాశమూ కల్పిస్తుంది. పాలసీ కింగ్ వినూత్నమైన ఆపరేటింగ్ నమూనాలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీనిని కన్వెన్షనల్ భీమా డిస్ట్రిబ్యూషన్ ఫ్రేమ్‌వర్క్ అలాగే డిజిటల్ కస్టమర్ ఎక్వైజేషన్, ఎంగేజ్‌మెంట్ వ్యవస్థ ఆధారంగా తీర్చిదిద్దారు.
ఆన్‌లైన్ భీమా మార్కెట్ ప్రాంగణాలు ఆధిపత్యం వహిస్తోన్న పోటీ మార్కెట్ వాతావరణంలో లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇప్పుడు ఆరోగ్య భీమా వినియోగదారులకు వినూత్నమైన సేవలనందించడం ద్వారా అగ్రగామిగా నిలువాలని ప్రయత్నిస్తోంది. ఆరోగ్య భీమా వినియోగదారులకు హాస్పిటల్ రవాణా, పేపర్ వర్క్, డాక్టర్ కన్సల్టేషన్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ మొదలైన సేవలను సైతం అందించనుంది. ఈ సేవలు ప్రత్యేకంగా పాలసీ కింగ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ కాంప్లిమెంటరీ సేవలను హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా పొందవచ్చు.
పాలసీ కింగ్‌తో లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ టియర్ 2, టియర్ 3 పట్టణాలలో సేవలందని మార్కెట్ విభాగాలలో సైతం చొచ్చుకుపోవాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో మెట్రో నగరాలలో సైతం తమ సేవలను మరింతగా విస్తరించనుంది. ఈ కంపెనీ 2023 ఆర్థిక సంవత్సరం నాటికి 10వేల భీమా వినియోగదారులను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వృద్ధి వ్యూహంతో పాటుగా లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇప్పుడు దేశవ్యాప్త భీమా ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. దీనిపై భారతదేశ వ్యాప్తంగా 5వేల మందికి పైగా భీమా ఎడ్వైజర్లు డిసెంబర్ 2022 నాటికి చేరనున్నారు. విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడంలో భాగంగా ఈ కంపెనీ తమ లీడర్‌షిప్ బృందాన్ని బలోపేతం చేస్తోంది. దీనిలో భాగంగా అగ్రగామి భీమా కంపెనీల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోనుంది. వృద్ధి అవకాశాల కోసం ఉన్న అవకాశాలను ఎంచుకోవడంతో పాటుగా లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ ఇప్పుడు వ్యూహాత్మక పెట్టుబడిదారులను సైతం చేరుకోవాలనుకుంటుంది. తద్వారా మార్కెట్‌లో తమ విస్తరణను మరింత వేగవంతం చేయనుంది.
భీమా రంగంలో ప్రవేశించడం గురించి లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ ప్రైవేట్‌లిమిటెడ్ ఫౌండర్ సచిదానంద ఉపాధ్యాయ్ మాట్లాడుతూ ‘‘భారతీయ భీమా చేరిక తక్కువగా ఉంది మరియు జీవిత మరియు జీవితేతర భీమా పట్ల అవగాహన పెరుగుతుండటం వల్ల వృద్ధి, సేవా డెలివరీ ఆవిష్కరణలకు అపూర్వ అవకాశాలు లభిస్తున్నాయి. సంప్రదాయ మరియు సాంకేతికాధికార విధానాలను మిళితం చేయడం ద్వారా మా వినూత్నంగా డిజైన్ చేసిన భీమా ప్లాట్‌ఫామ్ ఇప్పుడు భీమా కొనుగోలును సౌకర్యవంతంగా మలుస్తుంది. మా కాంప్లిమెంటరీ ఆరోగ్య భీమా మద్దతు సేవలు, సంప్రదాయ భీమా పంపిణీ వ్యవస్ధలన సమూలంగా మార్చడంతో పాటుగా వినియోగదారుల సేవా కొలమానాలను సైతం పునర్నిర్వచించనున్నాయి’’ అని అన్నారు.
Lord’s Mark Industries gets Direct Bhima from IRDAI