Friday, January 10, 2025

హీరో స్నేహితుడిగా..

- Advertisement -
- Advertisement -

Baba bhaskar act in Nenu Meeku Baga Kavalsinavadini

కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇందులో లీడ్ రోల్‌లో నటించిన స్టార్ కోరియోగ్రాఫర్ బాబా భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ “ఈ సినిమాలో హీరోకి స్నేహితుడిగా కీలక పాత్రలో నటించాను.

చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెకు కథ విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ బ్యానర్‌లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటిస్తూనే లాయర్ పాప సాంగ్‌కు కోరియోగ్రఫీ చేశాను.ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.ఈ సినిమా తర్వాత తెలుగులో నీలకంఠం చేసే సినిమాలో మంచి క్యారెక్టర్‌లో చేస్తున్నాను. తమిళ్‌లో ఒక సినిమాకు కోరియోగ్రఫీ చేస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News