Monday, December 23, 2024

రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని వెంకట్ రెడ్డి వాట్సప్ కాల్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి నుంచి పోటీ చేస్తున్న తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదే పదే వాట్సప్‌ కాల్‌ చేసి గ్రామ స్థాయి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు.  నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి ఎంపిటిసి సభ్యురాలు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులు తన ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాల్ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు. ఊకోండిలో మండల ఇన్‌ఛార్జి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అథ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఊకోండి మండలంలో చాలా మంది కాంగ్రెస్‌ నేతలకు వెంకట్‌రెడ్డి ఇలా ఫోన్‌ చేస్తున్నారని, కానీ బయటికి చెప్పేందుకు వారు ధైర్యం చేయడం లేదని వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News