Monday, December 23, 2024

రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించిన షేక్ హసీనా

- Advertisement -
- Advertisement -

Sheik Hasina

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం మధ్యాహ్నం అజ్మీర్‌లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దర్గా వద్ద ఆమెకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. హసీనా దర్గాలో  ‘జియారత్’ నిర్వహించారు. ఒక దేశాధినేత సందర్శనల కోసం అనుసరించిన ప్రోటోకాల్స్ ప్రకారం, దర్గా ఆవరణలో ఇతర భక్తులు ఎవరూ ఉండకుండా చూశారు, దర్గా మార్కెట్ కూడా మూసేశారు. ఇదిలావుండగా, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా భారత పర్యటనలో భాగంగా తనను ఆహ్వానించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్రంపై మండిపడ్డారు. ఆమె హసీనాను కలవడంపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతోందనే దానిపై తనకు కుతూహలంగా ఉందని బెనర్జీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News