Saturday, November 23, 2024

కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్

- Advertisement -
- Advertisement -

 

Siddique Kappan

న్యూఢిల్లీ: 2020లో దళిత మహిళ  సామూహిక అత్యాచారం, హత్యకు గురైన హత్రాస్‌ ప్రాంతానికి వెళ్తుండగా అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  కాగా మూడు రోజుల్లో సంబంధిత కోర్టులో హాజరుపరిచి బెయిల్‌పై విడుదల చేయనున్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై అతనిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అభియోగాలు మోపారు. ‘‘ఆ వ్యక్తి (కప్పన్) రెండేళ్లుగా కస్టడీలో ఉన్నాడు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ పేర్కొన్నారు. మలయాళ వార్తా పోర్టల్ ‘అజీముఖం’ రిపోర్టర్ సిద్ధిక్ కప్పన్‌ను హత్రాస్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై యుపి పోలీసులు అరెస్టు చేశారు.  కప్పన్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇటీవల  కప్పన్ తొమ్మిదేళ్ల కుమార్తె, పాఠశాల కార్యక్రమంలో “సాధారణ పౌరుల స్వేచ్ఛ , హక్కుల” గురించి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నా భర్త నిర్దోషి అని నాకు గట్టి నమ్మకం ఉంది,  705 రోజులు కుటుంబానికి చాలా బాధాకరమైనవి” అని కప్పన్ భార్య రిహానా కప్పన్ అన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఎస్. రవీంద్ర భట్ , పి.ఎస్. నరసింహారావు కూడా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి “ప్రతి వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. బాధితురాలికి న్యాయం జరగాలని, ఉమ్మడి గళాన్ని వినిపించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. చట్టం దృష్టిలో ఇది నేరం అవుతుందా?” అని ఈ సందర్భంగా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News