- Advertisement -
ఇటిక్యాల: మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సమీపంలోని గోషాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అయిజ నుంచి ఎర్రవల్లి చౌరస్తాకు బైక్ పై వెళ్లుతున్న వారిని వనపర్తి నుంచి గద్వాలకు వస్తున్న ఆర్టీసి బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. బస్సు ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -