- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు కురియనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని వివరించింది. వర్షంతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిమీ. వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని నారాయణపేట్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వానలు కురిసే అవకాశం ఉంది.
- Advertisement -