Saturday, November 23, 2024

దడ పుట్టిస్తున్న డెంగ్యూ….

- Advertisement -
- Advertisement -

Dengue fever cases on rise in Hyderabad

నగరంలో పెరుగుతున్న జ్వర బాధితులు
రోగులతో రద్దీగా మారిన ఫీవర్ ఆసుపత్రి
సకాలంలో పరీక్షలు చేయలేని వైద్య సిబ్బంది
ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న పలువురు రోగులు
రెండు నెలల్లో 3105 నమోదైన డెంగ్యూ కేసులు

హైదరాబాద్: గ్రేటర్ ప్రజలను డెంగ్యూ జ్వరాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులు బాట పడుతున్నారు. విషజ్వరాలుకు పేరుగాంచిన ఫీవర్ ఆసుపత్రి రోగులతో రద్దీగా మారింది. చాలామందికి ప్లేట్‌లేట్లు తగ్గిపోవడంతో ఐదారు రోజుల ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి వస్తుంది. దీంతో సరిపడ్డ వసతులు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే పరిస్దితి వస్తుంది. పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో టెస్టులు అందరికి చేయడం కష్టంగా మారింది. సమీపంలోని ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యధికంగా నగరంలోనే 3105 కేసులు నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

జూలై రెండోవారం నుంచి వానలు విస్తారంగా కురువడంతో బస్తీలు, కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు పెరిగి ప్రజలను కాటు వేయడంతో పలు రకాల వ్యాధులకు గురైతున్నారు. ఇటీవల వైద్యశాఖ జ్వర సర్వే చేయాలని ఆదేశించడంతో వైద్యబృందాలు ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్దితులపై వివరాలు సేకరిస్తున్నారు. అందులో ఇంటిలో ఒకరిద్దరు ఖచ్చితంగా దగ్గు, జలుబు, జ్వరం ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. వాతావరణ ప్రభావంతో డెంగ్యూతో పాటు ఇతర వ్యాధులు రెచ్చిపోయే అవకాశముందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రజలు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

డెంగ్యూ వ్యాధి లక్షణాలు: తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి కంటిలోపలి భాగంలో నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మం దద్దుర్లు, పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం, డెంగ్యూ హెరరేజిక్ జ్వరం వంటి లక్షణాలుంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఒంటిపై ఎర్రటి మచ్చలు రావడం, ఆయాసం, కళ్లు తిరగడం, రక్తపోటు తగ్గడం, ముక్క పంటి చిగుళ్ల, ఇతర అవయవాల నుంచి రక్తస్రావం, ఆపస్మరక స్దితి ఉంటే ప్రమాదం ఉంటుంది.
డెంగ్యూ వ్యాధి నిర్దారణ పరీక్షలు : జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు ఎన్‌ఎస్1 ఎలీసా, ఆరవ రోజు నుంచి ఎల్‌జీఎం ఏసీ ఎలీసా పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సెంటర్లో ఉచితంగా నిర్వహిస్తారు. ప్రైవేటు ఆసుపత్రులంటిని ఈపరీక్షలు చేయరని, ఆలస్యమైన సర్కార్ దవఖానలో పరీక్షలు చేయించుకోవాలంటున్న వైద్యసిబ్బంది.
డెంగ్యూ వ్యాప్తించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు : నీరు నిల్వ ఉంచిన తొట్లు, ఇతర పాత్రలు మూసిఉండాలి, కుళాయి వద్ద ఇతర ప్రదేశాలలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచిన దుస్తులు ధరించాలి.
వారానికి ఒకసారి నీటి తొట్లను ఇతర పాత్రలను శుభ్రంగా కలిగి తుడిచి మరలా నీరు నింపుకోవాలి. దోమతెరలను తప్పనిసరిగా వాడాలి. ఇంటిలోపల, బయట పనికిరాని చెత్తను ఉంచకుండా చూసుకోవాలి. ఉదయం, సాయంత్ర ఐదు నుంచి ఆరు గంటల సమయంలో తలుపులు కిటీకిలు మూసివేయాలి. ఇంటి పరిసరాల్లో ఫాగింగ్ చేయించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News