Monday, December 23, 2024

‘వాయిస్‌సే’తో తెలుగులోనూ యుపిఐ చెల్లింపులు!

- Advertisement -
- Advertisement -

UPI payments in Telugu with 'Voice'!

ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి టోన్ ట్యాగ్ కొత్త సదుపాయం
400 మిలియన్ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం
ఇంటర్‌నెట్ లేకున్నా వాయిస్ కమాండ్‌తో చెల్లింపులు చేసే అవకాశం
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరగనున్న డిజిటల్ పేమెంట్లు

న్యూఢిల్లీ: యుపిఐ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. వినియోగదారులు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) చెల్లింపు సేవలను ప్రాంతీయ భాషల్లో వినియోగించుకునే కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యుపిఐ 123పే సేవలు ఫీచర్ ఫోన్ వినియోగదారులకు సైతం ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక నుంచి ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమకు నచ్చిన భాషలో వాయిస్ కమాండ్ ద్వారా యూపిఐ చెల్లింపులు చేయవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఫీచర్‌ఫోన్లలో యుపిఐ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ప్రవేశపెట్టింది. యుపిఐ 123పే అని దీనికి పేరు పెట్టారు. దీనిద్వారా ఫీచర్‌ఫోన్ వినియోగదారులు యుపిఐ పేమెంట్లను ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకుండానే చేయవచ్చు. తాజాగా వాయిస్‌సే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కాగా ట్యాగ్ టోన్‌సంస్థ వాయిస్‌సే ఫీచర్‌ను ఎన్‌ఎస్‌డిఎల్ పేమెంట్స్ బ్యాంక్, ఎన్‌పిసిఐ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. టోన్ ట్యాగ్ ప్రవేశపెట్టిన కొత్త సదుపాయం ద్వారా తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ తదితర ప్రాంతీయ భాషల్లో యుపిఐ చెల్లింపులు చేయవచ్చు. త్వరలో గుజరాతీ, మరాఠీ, పంజాబీతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సేవలు లభించేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని టోన్ ట్యాగ్ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News