హైదరాబాద్ : బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎంఎల్ఎ దానం నాగేందర్.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ల అమలు కోసం తీర్మానం చేసి పంపినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్థలం కేటాయించినప్పటికీ కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్, ఆదివాసీ ల పోరాట యోధుడు కొమురం భీమ్. 44 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 స్మారక భవనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దేశంలో ఎక్కడ ఇలాంటి అద్భుతమైన భవనాలు నిర్మించలేదు. ముఖ్యమంత్రి గిరిజనుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారు.