Monday, December 23, 2024

ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

Inflows in equity mutual funds

ముంబయి : ఆగస్టులో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ప్రారంభించారు. దీంతో దేశీయ ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఆగస్టులో ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఫండ్లలో పెట్టుబడి 10నెలల కనిష్ఠానికి చేరిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచ్‌వల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలిపింది. ఆగస్టు నెలలో రూ.6,120కోట్లు పెట్టుబడులు నమోదయ్యాయి. జులైలో మొత్తం రూ.8,898 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. కాగా ఆగస్టులో 21.13లక్షల ఎస్‌ఐపి ఖాతాలు నమోదయ్యాయి. అయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) ఖాతాలు పెరిగినా గత నాలుగు నెలలుగా పెట్టుబడులు తగ్గుతున్నాయి. కాగా ఎయుఎం మ్యూచ్‌వల్ ఫండ్‌ల ఆస్తులు 6.39లక్షల కోట్లకు చేరుకుంది. ఆగస్టు చివరినాటికి మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వరుసగా మూడో నెల కూడా తగ్గుముఖం పట్టాయి. వడ్డీరేట్లు పెరగడంతోపాటు ద్రవ్యోల్బణం కారణంగా ఇన్వెస్టర్లు మ్యూచ్‌వల్ ఫండ్స్‌వైపు విముఖత చూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News