Friday, December 20, 2024

కృష్ణంరాజుకు నివాళులర్పించిన మంత్రి కెటిఆర్‌

- Advertisement -
- Advertisement -

Minister KTR pays tribute Krishnam Raju

హైదరాబాద్‌ : అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. కృష్ణంరాజు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారని పేర్కొన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. బాధ సమయంలో కుటుంబసభ్యులు మనోధైర్యంతో ఉండాలన్నారు. జీవించినంత కాలం అందరినీ కలుపుకొని వెళ్లారని కొనియాడారు. ఆయన అంత్యక్రియలు రేపు సెప్టెంబర్ 12న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News