Monday, December 23, 2024

మూడో టెస్టులో ఘన విజయం.. ఇంగ్లండ్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -

ENG Win by 9 wickets against SA in 3rd Test

లండన్: దక్షిణాఫ్రికాతో జరిగే మూడో, చివరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ టెస్టులో తొలి రెండు రోజుల ఆట వర్షం వల్ల బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. అయితే ఇంగ్లండ్ రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. 130 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 22.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జాక్ క్రాలి 69 (నాటౌట్) జట్టును గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 118, రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే ఆలౌటైంది.

ENG Win by 9 wickets against SA in 3rd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News