న్యూఢిల్లీ: భారతదేశం డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సరం పాటు జి-20 అధ్యక్ష పదవిని చేపడుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభమయ్యే దేశవ్యాప్తంగా 200 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని భావిస్తున్నారు. జి-20 లీడర్స్ సమ్మిట్ న్యూ ఢిల్లీలో జరుగుతుంది. 2023లో సెప్టెంబరు 9 – 10 తేదీల్లో న్యూఢిల్లీలో జి-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యుఎఈలు ఈ కార్యక్రమంలో “అతిథి దేశాలు”గా ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సెప్టెంబర్ 13న ప్రకటించింది.
India will assume the Presidency of the G20 for one year from 1 December 2022 to 30 November 2023.
Press Release on the forthcoming Presidency: https://t.co/LFQ6dmQgEd
— Arindam Bagchi (@MEAIndia) September 13, 2022