Monday, December 23, 2024

ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

'Nenu Meeku Baga Kavalsina Vadini' to release on Sep 16

శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి పాత్రికేయులతో మాట్లాడుతూ.. “ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రతి అమ్మాయి, ప్రతి ఫ్యామిలీ అడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. అలాగే తండ్రి,కూతురు మధ్యలో ఉండే అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించాము. ఈ సినిమాలో తక్కువ పాత్రలు ఉన్నా ప్రేక్షకులకు కొత్త పాత్రలు ఉంటే బాగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డిని, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్‌లను తీసుకోవడం జరిగింది. అయితే కిరణ్ అబ్బవరం, బాబా భాస్కర్‌ల ట్రాక్‌లతో పాటు ఎస్. వి.కృష్ణారెడ్డి, సంజనల ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. మణి శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మాకు ఆరు అద్భుతమైన వెరియేషన్స్ ఉన్న పాటలు ఇచ్చాడు. ఇందులో ఇక మెలోడీ, ఒక స్పెషల్ సాంగ్… ఇలా ఈ సినిమాకు పాటలు ప్లస్ అనుకుంటాను. ఈ సినిమాను ఓవర్సీస్‌లో కాకుండా ఇండియా వరకే 550 పైగా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము”అని అన్నారు.

‘Nenu Meeku Baga Kavalsina Vadini’ to release on Sep 16

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News