పాట్నా: ఇద్దరు అగంతకులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపడంతో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడిన సంఘటన బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. బెగుసరాయ్ జిల్లాలోని జాతీయ రహదారి-31, 28లపై వివిధ ప్రదేశాలలో ఇద్దరు దుండగులు బైక్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. మల్హిపూర్‌లో ఇద్దరు, బెరౌని థెర్మల్ చౌక్‌లో ముగ్గురు, బరౌనీలో ఇద్దరు, టెఘ్రాలో ఇద్దరు, బచ్ఛారాలో ఇద్దరిపై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. పాదాచారులపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపినట్టు గుర్తించామని ఎస్‌పి యోగేంద్ర కుమార్ తెలిపాడు. క్షతగాత్రులను వెంటనే బెగుసరాయ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు అమర్‌జీత్ కౌర్, గౌతమ్ కుమార్, నితీష్ కుమార్, విశాల్ కుమార్, దీపక్ కుమార్‌గా గుర్తించారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
బైక్‌పై వచ్చి కాల్పులు: ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -