Tuesday, November 26, 2024

భూగర్భం నుంచి వింత శబ్దాలు

- Advertisement -
- Advertisement -

Mysterious Underground Sounds In Maharashtra

 

ఔరంగాబాద్ : మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా లోని హసోరి గ్రామంలో కొన్ని రోజులుగా భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. గ్రామస్థులు మొదట ఆశ్చర్యానికి గురైనప్పటికీ గత వారం రోజులుగా అవి కొనసాగుతుండటంతో భయం మొదలైంది. దీనిపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నటిజమ్ నిపుణులు, నాందేఢ్ లోని స్వామీ రామానంద తీర్థ్ మరాఠ్వాడా యూనివర్శిటీ నిపుణులు అధ్యయనం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ గ్రామానికి 28 కిమీ దూరంలో కిలారి గ్రామంలో 1993లో భారీ భూకంపం సంభవించి 9700 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హసోరి గ్రామం లోనూ భూమి నుంచి ధ్వనులు వస్తుండటంతో భూకంపం కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ బీజీ మంగళవారం అక్కడికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతానికి అక్కడ భూకంప సూచికలు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News