Sunday, November 24, 2024

‘ఐడిఎల్’ భూములు ‘ఉదాసిన్‌’వే

- Advertisement -
- Advertisement -

సుప్రీం కోర్టు సంచలన తీర్పు 540.30 ఎకరాలు దేవాదాయ శాఖ పరిధిలోనే ఈ మఠానివే భూముల విలువ రూ.15వేల కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నడి బొడ్డున కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలోని అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థ లంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసిన్ మాఠానివేనని బుధవారం నాడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉదాసిన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ (ఐడిఎల్ కెమికల్స్) కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మఠం భూములను 1964,1966,1969,1978లో నాలుగు దఫాలు గా బఫర్ జోన్ ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌కు 99 సంవత్సరాల కాల వ్యవధికి లీజుకిచ్చిం ది.అయితే బఫర్ జోన్‌లో ఉన్న ఈ భూముల్లో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ 538 ఎకరాల విస్తీర్ణంలో రి యల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ ఉదాసిన్ మఠం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వి చారించిన ట్రిబ్యునల్ 2011లో గల్ఫ్ ఆయిల్ కా ర్పోరేషన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేసింది.

ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా 2013లో ఆ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసిం ది. దీన్ని సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2013 లో స్టేటస్‌కో మెయింటెయిన్ చేయాలని అత్యున్న త న్యాయాస్థ్థానం ఆదేశించింది. ఈక్రమంలో మంగళవారం పిటిషన్ విచారణకు రాగా గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ దాఖలు చేసిన పిటిష్‌న్‌ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిం ది. కాగా తాజా మార్కెట్ విలువ ప్రకారం ఈ భూ ముల విలువ రూ.15,000 కోట్లు మేరకు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

తీర్పుపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం

సుప్రీంకోర్టు తీర్పు పట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హ ర్షం వ్యక్తం చేశారు. భూములను కాపాడేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ తరపున వాదించిన న్యాయవాదులను మంత్రి అభినందించారు. దేవు డి మాన్యం భూములపై పూర్తి హక్కు దేవాదాయ సంస్థలకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు మ రోసారి స్పష్టం చేసిందని, ఇదే స్ఫూర్తితో ఆక్రమణలో ఉన్న దేవాదాయ శాఖ భూములను స్వాధీ నం చేసుకునేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా తాజా తీర్పునసరించి త్వరితగతిన పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు.కాగా బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ సుమారు రూ.15,000 కోట్లు ఉంటుందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News