పాట్నా: 2024 ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించనున్నట్టు బీహార్ సిఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఒక్క బీహార్‌కు మాత్రమే కాదు, అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. అందులో చేయకపోవడం అనేది ఏదీ ఉండదని చెప్పారు. పాట్నాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల గురించి విలేకరులు ప్రశ్నించగా పై విధంగా పేర్కొన్నారు. ఇటీవల నితీశ్ ఢిల్లీలో కాంగ్రెస్‌తో సహా పలు ప్రధాన పార్టీల పెద్దలతో సమావేశమయ్యారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 2007 నుంచి నితీశ్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సాధారణంగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు పలు అంశాలను పరిగణన లోకి తీసుకుని కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుంది. అలాంటి సమయాల్లో కేంద్ర రాష్ట్రాల నిధుల నిష్పత్తి 90:10 గా ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ హోదా ఉంది.
వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తాం : నితీశ్ కుమార్
- Advertisement -
- Advertisement -
- Advertisement -