Friday, November 22, 2024

ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం

- Advertisement -
- Advertisement -

sports ground in every village: Minister Srinivas Goud

క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్యలో 0.5 శాతం రిజర్వేషన్లు
రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడలు- 2022కు ఎంపికైన క్రీడాకారుల కోసం రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి అనేక చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడల అభివృద్ధి కి తెలంగాణలో పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన రాష్ట్రాల్లో రెండో స్థానం సాధించిన ఘనత తెలంగాణకు దక్కిందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన క్రీడాకారులకు నగదు పురస్కారాలను గణనీయంగా పెంచామన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ను కల్పించామన్నారు. 36వ జాతీయ క్రీడల్లో రాష్ట్రం నుంచి 26 క్రీడల్లో 126 మంది బాలికల, మహిళ క్రీడాకారిణులు, 104 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్ లు, 32 మంది మేనేజర్‌లు బృందం జాతీయ క్రీడలలో వివిధ రాష్ట్రాల జట్లతో పోటీపడుతున్నామన్నారు. క్రీడాకారులు ఆత్మవిశ్వాసం తో తమలోని ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలచారి, స్పోర్ట్ కమిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి జగదీష్‌యాదవ్, ప్రేమ్‌రాజ్, క్రీడాధికారులు సుజాత, ధనలక్ష్మి, క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రీడానైపుణ్యంతో చక్కని గుర్తింపు : మంత్రి
క్రీడల్లో చక్కని నైపుణ్యం కనబర్చడంతో సమాజంలో గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇటీవల జూనియర్ కామన్వెల్త్ క్రీడల్లో అద్భుతమైన ప్రతిభను కనబర్చి మెడల్ లను సాధించి యూత్ ఏషియా ఛాంపియన్స్ షిప్‌కు ఎంపికైనా ఫెన్సింగ్ క్రీడాకారులు బేబిరెడ్డి, షేక్ నజియా, వి.లోకేష్, కోశాధికారి సందీప్‌లను మంత్రి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News