Monday, December 23, 2024

‘నేషనల్‌ ఇంజినీర్స్‌ డే సింపోజియం’ నిర్వహించిన ఏఎస్‌బీఎల్‌

- Advertisement -
- Advertisement -

ASBL Held National Engineers Day Symposium

హైదరాబాద్: ఇంజినీరింగ్‌ పితామహుడు డాక్టర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తూ సెప్టెంబర్‌ 15వ తేదీన నేషనల్‌ ఇంజినీర్స్‌ డే సింపోజియంను అశోకా బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌బీఎల్‌) నిర్వహించింది. ఇంజినీరింగ్‌, రియల్‌ ఎస్టేట్‌లు ఒకదానితో పెనవేసుకుని పోయాయన్నది మనందరికీ తెలిసిన అంశం. భారతీయ ఇంజినీర్లకు బలమైన పునాది వేసిన వ్యక్తిగా చరిత్రకెక్కిన డాక్టర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించడానికి ఏఎస్‌బీఎల్‌ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

జాతీయ ఇంజినీర్స్‌ డే సందర్భంగా నిర్వహించిన సింపోజియంలో నిర్మాణ మరియు ఇంజినీరింగ్‌ రంగంలో సుప్రసిద్ధ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఏ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ శ్రీ రమేష్‌ మంత హాజరయ్యారు. భారతదేశంతో పాటుగా విదేశాలలో సైతం డిజైన్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరంగా 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఆయనకు ఉంది. విస్తృత శ్రేణిలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌లను ఆయన నిర్వహించారు. స్టార్ట్‌క్యాప్‌ కార్పోరేట్‌ ఎడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకులు శ్రీ అనూజ్‌ కపూర్‌ పరిశ్రమ నైపుణ్యం తీసుకురావడంతో పాటుగా నిర్మాణ ఆర్ధిక కోణం నుంచి సంబంధిత అంశాలను గురించి వెల్లడించారు. వాసవి కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ , హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ (హెచ్‌ఓడీ)డాక్టర్‌ భూపతి శ్రీధర్‌ విద్యా రంగం పరంగా పలు కీలకాంశాలను ప్రస్తావించారు. భవిష్యత్‌ పై దృష్టి కేంద్రీకరించి నిర్వహించిన ఈ ప్యానెల్‌ చర్చా కార్యక్రమంలో నిర్మాణ రంగంలో సాంకేతికత గురించి ఇన్‌సర్కిల్స్‌ టెక్నాలజీస్‌ కో–ఫౌండర్‌, సీఈఓ శ్రీ చంద్ర శేఖర్‌ బాబు వాసిరెడ్డి మాట్లాడగా, ఏఎస్‌బీఎల్‌ ఫౌండర్‌– సీఈఓ శ్రీ అజితేష్‌ కొరుపోలు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రాతినిధ్యం వహించారు.

ఈ రోజు సదస్సును ‘ రీ ఇమాజినింగ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ ఇండియా’ శీర్షికన నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో భావి తరపు డిమాండ్‌లను తీర్చేలా ఇంజినీరింగ్‌ సామర్థ్యం మెరుగుపరచడం కోసం ఉత్ర్పేరకంగా సాంకేతికత ఏ విధంగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందనేది ప్యానలిస్ట్‌లు చర్చించారు. ఇంజినీరింగ్‌ రంగంలో తమకు ఏ విధంగా డాక్టర్‌ విశ్వేశ్వరయ్య దారులను వేసినది శ్రీ అజితేష్‌ కొరుపోలు తెలిపారు. ఓ జాతిగా మనమంతా కూడా ఇప్పుడు సామర్థ్యం మెరుగుపరుచుకోవడం కోసం కృషి చేయాలన్నారు. అప్పుడు మాత్రమే అభివృద్ధి పరంగా లక్ష్యాలను చేరుకోగలమన్నారు.

ఈ కార్యక్రమంలో రమేష్‌ మంత మాట్లాడుతూ ‘‘ఓ సివిల్‌ ఇంజినీర్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో సుప్రసిద్ధ ఇంజినీర్‌ డాక్టర్‌ విశ్వేశ్వరయ్య. భారతీయ ఇంజినీరింగ్‌కు ఆయన అందించిన సేవలను గురించి వెల్లడించడం నాకు చాలా ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మన దేశంలోని నూతన, యువ ఇంజినీర్లందరూ ఆయన పనితీరును ఖచ్చితంగా పరిశీలించడంతో పాటుగా ఆయన నుంచి ప్రేరణ పొందాల్సి ఉంది’’ అని అన్నారు.

‘‘భారతదేశపు ఇంజినీరింగ్‌ పితామహునికి నివాళులర్పించే అవకాశం లభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. మౌలిక సదుపాయలు, ఇంజినీరింగ్‌ సమస్యలను పరిష్కరించే సాంకేతిక పరిజ్ఞానం దేశంలో లేని సమయంలో డాక్టర్‌ విశ్వేశ్వరయ్య మాకు ఓ మార్గం చూపారు. ఆయన పనితనం కాలపరీక్షలకు సైతం తట్టుకుని నిలబడింది. ఇప్పటికీ ఆయన అందించిన తోడ్పాటు కారణంగా దేశం ప్రయోజనం పొందుతూనే ఉంది. ఓ బ్రాండ్‌గా ఏఎస్‌బీఎల్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం మరియు నిరంతర ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ఆయనకు నివాళిలర్పిస్తూ నిర్వహించాలనుకున్నాము’’ అని ఈ సింపోజియం నిర్వహించడం గురించి ఏఎస్‌బీఎల్‌ ఫౌండర్‌ – సీఈఓ శ్రీ అజితేష్‌ కొరుపొలు అన్నారు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న శక్తివంతమైన బ్రాండ్‌ అశోకా బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌బీఎల్‌). డిజైన్‌ మరియు నిర్మాణ సాంకేతికత పరంగా ఆవిష్కరణలు చేయడానికి ఏఎస్‌బీఎల్‌ స్ధిరంగా చేస్తోన్న ప్రయత్నాల కారణంగానే విశ్వసనీయత, నాణ్యత, టైమ్‌ సెన్సిటివిటీకి ప్రతిరూపంగా ఏఎస్‌బీఎల్‌ నిలిచింది.

ASBL Held National Engineers Day Symposium

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News