Monday, December 23, 2024

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జడ్పీ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా హాజరైన జనంతో కలిసి అడుగులు వేస్తూ జాతీయ జెండా చేతబట్టి… బోలో భారత్ మాతాజీకి జై… జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కదిలారు. బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, క్లాక్ టవర్, తెలంగాణ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మంత్రి కదిలారు.

ఈ ర్యాలీలో మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా ఛైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News