Monday, December 23, 2024

ఆ విషయంలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు: తలసాని

- Advertisement -
- Advertisement -

KCR Name in history

హైదరాబాద్: తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. పీపుల్స్ ప్లాజా లో తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సి.ఎస్. సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.  ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనంతరం పీపుల్స్ ప్లాజా లో జరిగిన బహిరంగ సభలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడారు.  ప్రజల సహకారంతో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించు కున్నామని చెప్పారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయానికి భారత రత్న బీఆర్ అంబేడ్కర్ పేరుపెట్టడం ద్వారా సిఎం కెసిఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News