Sunday, December 22, 2024

దొంగకు తగిన గుణపాఠం చెప్పిన రైలు ప్రయాణికులు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Bihar thief dangles from train window video viral

బీహార్: కిటికీలోంచి మొబైల్ చోరీకి ప్రయత్నించిన ఓ బీహార్ దొంగకు రైలు ప్రయాణికులు తగిన గుణపాఠం చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌లోని సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒక దొంగ రైలు నుండి కిటికీలోంచి మొబైల్‌ను దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన ప్రయాణీకుడు అతని చేయి పట్టుకున్నాడు. దీంతో దొంగ తనను వదలమని వేడుకున్నాడు. కానీ రైలు కదులుతున్నప్పుడు ప్రయాణీకులు అతని చేతిని పట్టుకున్నారు. తనను పట్టుకోమని ప్రయాణికులకు మరో చేయి ఇచ్చి కరుణించమని వేడుకున్నాడు. రైలు ఖగారియా రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ప్రయాణీకులు అతనికి బుద్ది చెప్పి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News