Sunday, December 22, 2024

ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్

- Advertisement -
- Advertisement -

ఈటివి ప్రభాకర్ తనయుడు, త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్న చంద్రహాస్ శనివారం తన పుట్టిరోజును జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సిసిలో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అతను నటిస్తున్న చిత్రాల నుంచి హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌లను చంద్రహాస్ తల్లి, ప్రభాకర్ భార్య మలయజ లాంచ్ చేశారు. అలాగే ఇదే వేదికపై చంద్రహాస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ “మా అబ్బాయి చంద్రహాస్ ఇండస్ట్రీని నమ్ముకొని నటననే ప్రొఫెషన్‌గా తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. ప్రొడ్యూసర్స్ కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టిలు ఐ.ఇ.ఎఫ్, ఆర్.కె-.ఏ.కె ఫిలింస్ పతాకంపై చంద్రహాస్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి రచన, దర్శకత్వం కృష్ణ. అలాగే ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై ఏవీఆర్, నరేష్‌లు మా అబ్బాయితో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు సంపత్ వి. రుద్ర. వీరితో పాటు మా స్వంత సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్ చేశాం. దీనికి నా మిత్రులు కళ్యాణ్, వెంకట్, కాముని శివ, ప్రేమ్ సాగర్, తోట సురేష్‌లు కోప్రొడ్యూసర్‌లు. అయితే మా సినిమా కొంత టైం తీసుకుని ప్రారంభిస్తాం. దీనికి కథ, స్క్రీన్‌ప్లేను నేను అందిస్తున్నాను. మిగిలిన టెక్నీషియన్స్ కూడా ఫైనల్ అయ్యారు. ముందు రెండు చిత్రాలు ఇప్పటికే షూటింగ్‌లు జరుపు కుంటున్నాయి”అని అన్నారు. హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడానికి నా వైపు నుంచి ఎటువంటి లోపం లేకుండా కృషి చేస్తాను. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా పరిశ్రమలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లను చూసి ప్రేరణ పొందాను” అని పేర్కొన్నారు.

ETV Prabhakar Son introduction as Hero

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News