Monday, December 23, 2024

ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

ED Raids in Hyderabad

దేశవ్యాప్తంగా 40ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు 
హైదరాబాద్‌లో 20 బృందాలతో తనిఖీలు

18 కంపెనీలకు చెందని 12మందికి నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి అధికారులు దేశవ్యాప్తం గా ఐదు రాష్ట్రాలోని 40 ప్రాంతాల్లో ఏకకాలంలో మరోసారి సోదాలు చేపట్టారు. ఈక్రమంలో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలోని 18 కంపెనీలలో సో దాలు చేపట్టిన ఇడి అధికారులు 12 మందికి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపడుతోంది. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలో 25 ఇడి బృందాలు గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కో కాపేట, దోమలగూడ, ఇందిరాపార్క్ దగ్గర శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పలువురు వ్యాపారవేత్తలకు రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఇడి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలలో భాగంగా పలు కంపెనీలకు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసినవారి కార్యాలయాలతో పాటు ఇళ్లపైనా దాడు లు చేశారు. ఒకవైపు దాడులు చేస్తూనే మరోవైపు 18 కంపెనీలకు చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేశారు. అరవిందో ఫార్మా, పిక్నీన్ ఎంటర్ ప్రైజెస్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గానామిక్స్ ఇకో సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలకు ఇడి నోటీసులిచ్చింది.
ఏకకాలంలో సోదాలు
హైదరాబాద్, నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఢిల్లీకి చెందిన ఇడి అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడిన ఇడి అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బెంగళూరు, చెన్నైలోనూ సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 40కి పైగా ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు ఇడిఅధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం నుంచి దోమలగూడలోని శ్రీ సాయి కృష్ణా రెసిడెన్సిలోని ఓ కార్యాలయంతో పాటు గోరంట్ల అసోసియేట్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో శ్రీ సాయి కృష్ణా రెసిడెన్సి, గోరంట్ల అసోసియేట్ కార్యాలయం ముందు కేంద్ర బలగాలు (సిఆర్‌పిఎఫ్) పహారా కాశారు. అలాగే మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌తో పాటు ఈ ఎన్‌క్లేవ్‌లో ఉన్న అనూస్ బ్యూటీ పార్లర్ కార్యాలయం, రాయదుర్గంలోని ఓ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎపి ఎంపి ఇళ్లు, కార్యాలయాల్లో
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి నివాసంలోనూ ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని లోధీ రోడ్డులో ఉన్న 95వ నంబర్ బంగ్లాలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. అలాగే ఎపిలోని నెల్లూరులోని రాయాజీ వీధిలో ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి నివాసంలోనూ సోదాలు జరిపారు. సోదాల సమయంలో ఏలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదివరలోనూ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇదివరలో నగరంలోని రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి చిరునామా ఉన్నట్లు ఇడి అధికారులు గుర్తించారు. అక్కడికి వెళ్లి తనిఖీ చేసిన ఇడి అధికారులకు సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారు. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి ఇ మెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఇడి అధికారుల దర్యాప్తులో తేలింది. అలాగే కోకాపేటలోని రాంచంద్ర పిళ్లై నివాసంలోనూ ఇడి అధికారుల సోదాలు జరిగాయి. పలువురి రాజకీయ ప్రముఖులతో రాంచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు అనుమానించిన అధికారులు తగిన ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ED Raids in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News