న్యూఢిల్లీ: నేడు, ఇన్‌స్టాగ్రామ్ తమ ‘పేరెంటల్ సూపర్ విజన్ టూల్స్’ (తల్లిదండ్రుల పర్యవేక్షణ సాధనాలు)ను భారతదేశంలో విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌పై టీనేజర్ల అనుభవాల పరంగా మరింతగా జోక్యం చేసుకునేందుకు ఇది తల్లిదండ్రులకు అనుమతిస్తుంది. దీనితో పాటుగా ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ‘ఫ్యామిలీ సెంటర్’ను సైతం పరిచయం చేసింది. తల్లిదండ్రులు మరియు సంరక్షకులు పర్యవేక్షణ సాధనాలు మరియు తగిన సమాచారాన్ని సుప్రసిద్ధ నిపుణుల నుంచి పొందేందుకు అనువైన నూతన ప్రాంగణమిది.
భారతదేశంలోని నిపుణులు, తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు యువతతో అతి సన్నిహితంగా మెటా పనిచేయడం ద్వారా తల్లిదండ్రులు మరియు యువత అవసరాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ సేవల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు తగిన సాధనాలు మరియు వనరులు అవశ్యకత అధికంగా ఉందిప్పుడు. ఈ అవగాహన కారణంగా తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ టీనేజర్ల ఆన్‌లైన్ అనుభవాలను నిర్వహించడంలో సహాయపడగలరు. ఈ నేపథ్యంతోనే మెటా ఇప్పుడు పేరెంటల్ సూపర్ విజన్ కంట్రోల్స్ మరియు ఫ్యామిలీ సెంటర్‌ను యుఎస్‌లో ఈ మార్చిలో ప్రారంభించింది. ఇప్పుడు ఆ సేవలను భారతదేశంలోనూ ప్రారంభించింది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇండియా (మెటా) పబ్లిక్ పాలసీ, హెడ్, నటాషా జోగ్ మాట్లాడుతూ ‘‘ మా కమ్యూనిటీ భద్రత, మెటా వద్ద మాకు అత్యంత ప్రాధాన్యతాంశం. ఈ సూపర్ విజన్ టూల్స్ మరియు ఫ్యామిలీ సెంటర్ లు యువతను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచాలనే మా ప్రయత్నాలకు అదనపు బలం అందిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ వినియోగించేటప్పుడు కొంత స్వతంత్య్రత కావాలనుకునే యువత కోరికల నడుమ సమతుల్యతను పాటిస్తూనే, సహాయం అవసరమైనప్పుడు తల్లిదండ్రులు మరియు యువత మధ్య సంభాషణలకు మద్దతునందించే రీతిలో పర్యవేక్షణను సైతం అనుమతించాలన్నది మా ప్రయత్నం. నేటి ఆవిష్కరణలతో పాటుగా ఈ విధానంలో మాకు అవసరమైన పరిజ్ఞానమందించిన మా నిపుణులైన భాగస్వాములందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
ఇన్‌స్టాగ్రామ్ పై నూతన సూపర్‌విజన్ టూల్స్
నేటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌పై నూతన సూపర్‌విజన్ టూల్స్ లభ్యమవుతున్నాయి. ఇవి తల్లిదండ్రులు మరియు సంరక్షకులను ఈ దిగువ అంశాలను చేయడానికి అనుమతిస్తాయి ః
· ఇన్‌స్టాగ్రామ్ పై ఎంత సమయం తమ పిల్లలు గడపాలన్నది నిర్ధేశించవచ్చు – స్ర్కీన్ టైమ్ పరిమితులు మరియు షెడ్యూలింగ్ బ్రేక్స్‌ను రోజు, వారంలో పెట్టడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ పై తమ సమయాన్ని యువత నిర్వహించుకోవడంలో సహాయపడవచ్చు.
· ఎలాంటి ఖాతాలను తమ పిల్లలు అనుసరిస్తునారో అలాగే ఎలాంటి ఖాతాలు మీ పిల్లలను అనుసరిస్తున్నాయో చూడవచ్చు ఇన్‌స్టాగ్రామ్‌పై మీ పిల్లలు ఎవరెవరితో కనెక్ట్ అవుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది మీకు అనుమతిస్తుంది.
·మీ పిల్లలు ఎవరినైనా రిపోర్ట్ చేసిన ఎడల అది మీకు కూడా తెలుస్తుంది – ఇన్‌స్టాగ్రామ్‌పై ఒకవేళ మీ పిల్లలు రిపోర్ట్ చేసినట్లయితే దానిని మీకు తెలిసేలా చేయవచ్చు. తద్వారా ఏమి జరిగిందనేది మీరు చర్చించవచ్చు.పేరెంటింగ్ అవసరాల కోసం భారతదేశంలో సుప్రసిద్ధ మరియు నమ్మకమైన డిస్కవరీ ప్లాట్‌ఫామ్ కిడ్స్‌స్టాప్‌ప్రెస్ డాట్ కామ్ (Kidsstoppress. com)తో మెటా కలిసి పనిచేయడంతో పాటుగా తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తూ ఈ సాధనాల పట్ల అవగాహన కల్పిస్తోంది.
కిడ్స్‌స్టాప్‌ప్రెస్ డాట్ కామ్ ఫౌండర్–సీఈఓ మాన్సీ జవేరీ మాట్లాడుతూ ‘‘సురక్షితమైన మరియు సమృద్ధితో కూడిన ఆన్‌లైన్ అనుభవాలను పొందడమనేది తల్లిదండ్రులకు నిరంతరం అతిపెద్ద ఆందోళనగా ఉంటుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు భారతదేశంలో ఈ సూపర్‌విజన్ టూల్స్‌ను పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము మరియు వారితో కలిసి పేరెంటింగ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అందువల్ల భారతదేశంలో పేరెంటింగ్ కమ్యూనిటీ ఈ సాధనాల పట్ల అవగాహన పొందడంతో పాటుగా సన్నద్ధమై ఉండటం వల్ల తమ పిల్లలతో వారు సంభాషణలను ఈ అంశాలపై చేయవచ్చు’’ అని అన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌పై తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లలకు ఆహ్వానాలను పంపడం ద్వారా సూపర్‌విజన్ టూల్స్‌ను ప్రారంభించవచ్చు. రాబోయే కొద్ది నెలల్లో మేము అదనపు సూపర్‌విజన్ ఉపకరణాలు మరియు ఫీచర్లను ఫ్యామిలీ సెంటర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నాము. సూపర్‌విజన్ టూల్స్‌ను ఏ విధంగా సెట్–అప్ చేసుకోవాలనేది తెలుసుకునేందుకు https://help.instagram.com/309877544512275 వెబ్‌సైట్ చూడవచ్చు
తల్లిదండ్రులు, సంరక్షకులు కోసం విద్యాకేంద్రం
ఫ్యామిలీ సెంటర్ (https://familycenter.instagram.com/?utm_source=meta.com&utm_ mediu m=redirect)లో నూతన విద్యా కేంద్రం కూడా భాగంగా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు మరియు సంరక్షకులు నిపుణుల నుంచి తగిన పరిజ్ఞానం పొందడంతో పాటుగా ఉపయుక్తమైన ఆర్టికల్స్, వీడియోలు మరియు సోషల్ మీడియా గురించి మీ పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి లాంటి అంశాలపై తగిన సలహాలను వీక్షించవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యుత్తమంగా పొందేందుకు తల్లిదండ్రులు ఈ నూతన సూపర్‌విజన్ టూల్స్‌ను ఏ విధంగా ఉపయోగించాలనే అంశాలపై వీడియో ట్యుటోరియల్స్ సైతం వీక్షించవచ్చు.
యూత్ మీడియా, ఇన్‌సైట్స్ కంపెనీ యువ తో ఇప్పుడు మెటా కలిసి పనిచేయడం ద్వారా ఈ రిసోర్శెస్ గురించి కూడా అవగాహన కల్పించనుంది. యువ కో–ఫౌండర్, సీఈఓ నిఖిల్ తనేజా మాట్లాడుతూ ‘‘నేటి యువతరం తమ ఆన్‌లైన్ అనుభ వాలను గురించి మాట్లాడాలనుకుంటుంది కానీ తమ తల్లిదండ్రులతో ఆ అంశాలను గురించి మాట్లాడాలంటే మాత్రం భయపడుతుంటారు. దీనికి జెనరేషన్ గ్యాప్ ఓ కారణం. దురదృష్టవశాత్తు జెన్ జెడ్‌లకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉంది. మెటాతో మా భాగస్వామ్యం లో భాగంగా, మేము ఈ అంతరాలను పూరించడంతో పాటుగా నేడు విడుదల చేసిన టూల్స్, వనరులు వారికి అవసరమైన సంభాషణలను ప్రారంభించేందుకు తోడ్పడతాయి’’ అని అన్నారు.
భారతదేశం నుంచి , ఈ సెంటర్‌లో రిసోర్శెస్ అయినటువంటి పేరెంట్స్ గైడ్ ; ఫోర్టిస్ మెంటల్ హెల్త్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ‘డీలింగ్ విత్ ఎగ్జామ్ స్ట్రెస్ గైడ్’ ; ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేందుకు క్వీర్ ముస్లిం ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ‘ఎల్‌జీబీటీక్యు గైడ్’ ; యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్ (వైఎల్‌ఏసీ)తో భాగస్వామ్యం తో అభివృద్ధి చేసిన ‘బిల్డింగ్ హెల్త్ డిజిటల్ హ్యాబిట్స్’ గైడ్ మరియు ‘క్రియేటింగ్ స్పేసెస్’, ‘మేనేజింగ్ యువర్ మెంటల్ హెల్త్’ గైడ్ వంటివి ఉంటాయి. ఈ సెంటర్ ఇంగ్లీష్, హిందీలో లభ్యమవుతుంది.