Sunday, November 24, 2024

కృష్ణ పాత్రకు నాగశౌర్య సరిగ్గా సరిపోతారు

- Advertisement -
- Advertisement -

Director Anish R Krishna interview about Krishna Vrinda Vihari

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపధ్యంలో దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ మీడియాతో మాట్లాడుతూ “నాగశౌర్యకి 2020లో ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన హోమ్ బ్యానర్ లోనే ఈ కథ చేయాలని నిర్ణయించారు. చాలా బలమైన కథ ఇది. ఇప్పటివరకూ ఇందులో వున్న యూనిక్ పాయింట్ ని ఇంకా తెలియజేయలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కథపై ఒక అవగాహన ఇస్తాం.

అయితే ఈ కథకి మూలం చెప్తాను. నాకు బాగా కావాల్సిన సన్నిహితుడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఫ్రేమ్ చేసుకున్న కథ ఇది. ఈ పాయింట్ చాలా ఎంటర్ టైనర్ గా వుంటుంది. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు. నాగశౌర్యకి ఒక యూనిక్ స్టయిల్ వుంది. ఆయనలో ఒకరకమైన అమాయకత్వం, క్యూట్ నెస్, కొంటెతనం, అల్లరి వుంటుంది. కృష్ణ పాత్రకు నాగశౌర్య సరిగ్గా సరిపోతారు. ఇందులో నేను ఎంచుకున్న నేపధ్యం కూడా ఆచార్యులు. శౌర్యని చూడగానే ఆ ఛార్మ్ కనిపించింది. ‘కృష్ణ వ్రింద విహారి’లో హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. నాగశౌర్యతో పాటు బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు మంచి వినోదాన్ని పంచుతాయి. సినిమాని ప్రేమించి తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూస్తారు. మహతి సాగర్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలకు మంచి స్పందన వస్తోంది” అని అన్నారు.

Director Anish R Krishna interview about Krishna Vrinda Vihari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News