- Advertisement -
న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 11 రోజుల విదేశీ పర్యటనకు ఆదివారం బయలుదేరి వెళ్లుతారు. ఐక్యరాజ్య సమితి 77వ సర్వప్రతినిధి సభ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ నెల 24న ఆయన ఐరాసలో ప్రసంగిస్తారు. క్వాడ్, బ్రిక్స్ సమావేశాలలో కూడా పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. 18 నుంచి 24 వరకూ న్యూయార్క్‌లో జరిగే బృందాలవారి బహుళస్థాయి సమావేశాలలో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారు. 25 నుంచి 28వరకూ అమెరికా సీనియర్ అధికారులతో ప్రత్యేకించి అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల స్థాయి భేటీ దశలో ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ను, జపాన్, ఆస్ట్రేలియాల విదేశాంగ మంత్రులను కలుసుకుంటారని వెల్లడైంది.
- Advertisement -